రోజా సెల్వమణి దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త. ఈమె తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.