బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీ (Luggage)ని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. బైక్ మీద వెళ్తే లగేజీ పెట్టడానికి స్థలం ఉండదని, కార్లు, ఆటోలు బుక్ చేస్తుంటాం. అయితే ఓ యువకుడు లగేజీ ట్రాలీ బ్యాగ్‌లను (Trolley bags) బైక్‌పై తీసుకెళ్లడానికి చాలా సులభమైన మార్గం కనిపెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో, బైక్ వెనుక ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఓ వ్యక్తి బైక్ (Bike) నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి తన భుజానికి ఒక బ్యాగ్‌ని తగిలించుకుని, రెండు చేతులతో రెండు ట్రాలీ బ్యాగ్‌లను పట్టుకున్నాడు. బైక్‌తో పాటు ఆ ట్రాలీ బ్యాగ్‌లు సునాయాసంగా ముందుకు వెళ్లిపోతున్నాయి. వెనుక కారులో వెళ్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “ఈ టెక్నిక్ చాలా బాగుంది“, “ఆటోలో కూడా ఇంత లగేజీ తీసుకెళ్లడం కష్టమేమో“, “రోడ్లు బాగుంటే ఇది మంచి ఐడియా“, “ట్రాలీ చక్రాలు పాడైపోతాయి“ అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
Spread the love రోడ్డు పై ఆటో ఎక్కిన సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని 5 నిమిషాల్లో యజమానికి పెద్ద షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ రోడ్డు పై ఆటో ఎక్కిన సాఫ్ట్ వేర్ […]
Spread the love Apsara Death Case: అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు […]
Spread the love అన్యాయాలు శ్రుతిమించుతునాయి….అసలే 45 డిగ్రీలు కంటే ఎక్కువ ఉష్రోగతలు…బయటకి వస్తే..వడ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలు అవుతున్నాం…ఇక ఆఫీస్ లు,ఉద్యోగాలు, ఇంకా అవసరమైన పనులు ఉంటే బయటకి రాక తప్పదు..అందరికీ […]