తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. ఉగాది పర్వదినం జరుగబోతోంది. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశిఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో.. ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో విశాఖ శంకరమఠం వేదపండితులు, జ్యోతిష నిపుణులు కందుకూరి బాలసుబ్రమణ్య శర్మ రాశీఫలాలు తెలిపారు. 2024 క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా వివరించారు.
జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ప్రతిరాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిదిపాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు. మేషరాశి నుంచీ మొదలై మీన రాశీ వరకూ నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానాలు చెబుతారు.