తారకరత్న చనిపోయిన వెంటనే ఆసుపత్రిలో ఎదురైన చేదు ఘటన ఏమైందో తెలిసి ఆందోళనలో నందమూరి కుటుంబం

Spread the love

నందమూరి నటుడు, యంగ్‌ హీరో తారకరత్న 23రోజుల పోరాటం అనంతరం శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న తుదిశ్వాస విడిచారు. అత్యంత విషమ పరిస్థితి నుంచి కోలుకున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. బెస్ట్ ట్రీట్‌మెంట్‌ అందుతుందని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని బాలకృష్ణ తో సహా అంతా భావించారు. కానీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఈ రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రెయిన్‌ డెడ్‌కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. అంబులెన్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు. అయితే తారకరత్న కన్నుమూశారనే వార్తతో స్థానికంగా ఉన్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారిచూసేందుకు భారీగా తరలి వచ్చారు. అభిమానుల తాకిడిని గమనించిన వైద్య బృందం.. తారకరత్న భౌతిక కాయాన్ని ఆసుపత్రి బ్యాక్‌ గేట్‌ ద్వారా అంబులెన్స్ లో తరలిస్తున్నారు. రేపు(ఆదివారం)ఉదయం వరకు ఆయన మృతదేహం హైదరాబాద్‌కి చేరే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే తారకరత్నని బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తారకరత్నని చూసేందుకు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, ఆయన్ని చూడాలని తపించామని, కానీ తమకు సమాచారం ఇవ్వకుండా, చూడనివ్వకుండా బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించడం పట్ల వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకి బాడీని చూపించాలని, చూపించేంత

వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే తారకరత్న భౌతికకాయానికి ఎల్లుండి(సోమవారం) సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు తారకరత్న మృతి వార్తతో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయిన తారకరత్న అదేమిటో తెలిసి శోకసంద్రం లో నందమూరి ఫ్యామిలీ

ఈ రోజు ఆదివారం రాశి ఫలితాలు మీకోసం