చాలామందికి చిన్నచిన్న విషయాలే కోపం తెప్పించేస్తాయి. మహిళలకు అయితే మరీనూ.. వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడితే వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా బిందె నింపుకుని వెళ్ళడం చాలా అరుదనే చెప్పాలి. సరిగ్గా అదే రేంజ్ లో రెచ్చిపోయారు ఇద్దరు మహిళలు. బస్సులో సీటుకోసం తిట్టుకోవడంతో మొదలైన వీళ్ల గోల జుట్టుపట్టుకుని కొట్టుకోవడం వరకు వెళ్ళింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకుంటే..
ప్రభుత్వ బస్సులో సీటుకోసం గొడవ పడుతున్న ఇద్దరు మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో Gharkekalesh అనే ట్విట్టర్ యూజర్ ఈ మహిళల వీడియోను షేర్ చేశారు. మహిళలు ప్రభుత్వ బస్సు ఎక్కగానే కనిపించిన ఒకేఒక్క ఖాళీ సీటుకోసం గొడవ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వారిద్దరూ ఆ సీటు నాదంటే నాదంటూ గొడవ పడటం స్టార్ట్ చేశారు. సీటులో కూర్చోనివ్వకుండా అడ్డుకోవడానికి ఒకరి మీద మరొకరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో
వారి గొడవ తిట్టుకోవడం నుండి చెయ్యి చేసుకోవడానికి దారితీసింది. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు వారి గొడవ అడ్డుకోవడానికి ప్రయత్నించారు కానీ, మహిళలు గొడవ ఆపలేదు. వారి గొడవ హద్దు దాటిపోయి ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చివరకు బస్సు ఆపి ఆ మహిళలను బస్సులో నుండి కిందకు దించేశారు. అక్కడ పోలీసులు ఆ మహిళల గురించి అడుగుతుంటే వారు తమని తాము సమర్థించుకుని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
పోలీసులు వారితో మాట్లాడుతున్నట్టే ఆ మహిళలు మళ్ళీ తిట్టుకోవడం, కొట్టుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఈ ఆడోళ్ళు తగ్గకుండా ఉన్నారే.. ఎక్కడ మన తుప్పు తీస్తారో అని ఆ పోలీసులే భయపడి పక్కకు నిలబడినట్టు అనిపిస్తోంది. మహిళల గొడవ మొత్తం వీడియో తీస్తున్న వ్యక్తి పోలీసులు వారిని
అడ్డుకుంటుంటే రుక్ జావో యార్ మజా ఆ రహా హై అని అనడం సోషల్ మీడియో అందరూ కామెంట్ చెయ్యడానికి కారణం అవుతోంది. ఆ మహిళల గొడవ అతనికి అంత మజా తెప్పిస్తోందా అని నెటిజన్లు అంటున్నారు. ఆ మహిళలు ప్రయాణించిన బస్సు స్టార్ట్ అయి ముందుకెళ్ళి పోతున్నా ఆ మహిళలు కొట్టుకోవడం ఆపలేదు.. ఆఖరికి గొడవ ముగింపు చూడకుండానే వీడియో ముగిసింది. ఆడవారి గొడవ ఎప్పుడూ జుట్టుపట్టుకుని కొట్టుకోవడంతోనే ముగుస్తుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Spread the love ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని […]
Spread the love పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి […]
Spread the love జీవితం ఎవరికి ఎప్పుడు ఎలా మరాబోతుందో ఎవరికి తెలియదు అందుకనేమో క్షణం మనది కాదు అని అంటారు దాని అర్థం మంచి జరగొచ్చు,చేదు జరగొచ్చు.మంచి జరిగితే ఎవరికైనా సంతోషం గా […]