బండిల్స్ ఉండవు కదా? అంటూ ఆఫీసర్స్‌ని లోపలికి పంపిస్తాడు ధర్మరాజు. వాళ్లు లెక్కలు చూసుకుని అంతా కరెక్ట్‌గానే చెప్పడంతో ధర్మరాజుకి ఫ్యూజులు ఎరిగిపోతాయి. ‘అం..తా.. అంతా బాగానే ఉన్నాయా? సరిగా చూశారా లోపల?’ అంటాడు ధర్మరాజు అనుమానంగా. ‘ఏంటి సార్ అలా అడుగుతున్నారు అంతా చూశాం కదా..’ అంటాడు ఆ ఆఫీసర్స్‌లో ఒకడు. దాంతో ధర్మరాజు.. కూడా లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ తను తీసుకుని వెళ్లిన బండిల్స్ ఉండటం చూసి షాక్ అవుతాడు. ‘ఇవేంటి ఇక్కడున్నాయ్’ అంటూ బిత్తర చూపులు చూస్తూ లెక్క సరిపోయింది అంటూ బయటికి నడుస్తాడు. ఇక అదే షాక్‌లో ఉండగా ఆఫీసర్స్ బయటికి వచ్చి.. ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టింనందుకు సారీ..’ అనేసి బయలుదేరతారు.
ఊరికే వదిలిపెట్టను..

‘ధర్మరాజుగారు మేము వెళ్లొస్తాం’ అంటారు వాళ్లు. ‘సార్ రండి.. రండి’ అంటూ ధర్మరాజు వాళ్లని అలా తీసుకుని వెళ్లగానే.. జగతీ మిగిలిన లెక్చరర్స్.. క్లాస్‌లకి వెళ్లమని పంపిస్తుంది. ఇక రిషితో వసు.. ‘సార్ ధర్మరాజే దొంగ అని మీకు ఎలా తెలిసింది?’ అంటుంది. ‘ధర్మరాజు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి దొరికిపోయాడు అంటూ జరిగింది చెబుతాడు. ధర్మరాజు మహేంద్ర జేబులోంచి పడిన కీని.. సబ్బులో నొక్కి.. అరగంటలో వస్తాను అని వెళ్లినప్పుడు రిషి ఎదురుపడిన సీన్ గురించి మహేంద్ర వాళ్లకి చెబుతాడు. అప్పుడు నాకు ఆయన చేతిని పట్టుకోగానే సబ్బు వాసన వచ్చింది. ఇక మేడమ్ కీ సబ్బు వాసన వస్తుంది అనగానే.. నాకు అర్థమైంది. ధర్మరాజే ఇలా చేశాడని.. డాడ్ ఆ ధర్మరాజుని ఊరికే వదిలిపెట్టను.. ముందు ఈ రూమ్ లాక్ చేయండి’ అంటాడు రిషి. ఇక ధర్మరాజు ఆ ఆఫీసర్స్‌ని పంపించేసి.. మెట్లు దిగి వెళ్లబోతాడు. అప్పుడే రిషి ధర్మరాజుగారు అని పిలుస్తాడు.
నిజం చెప్పిన రిషి..

‘ఏంటి ఆ మూడు బండిల్స్ ఎలా వచ్చాయని తెగ ఆలోచిస్తున్నట్లున్నారు?’ అంటాడు రిషి. ‘ఏం మాట్లాడుతున్నారు సార్.. త్రీ బండిల్స్ ఏంటీ?’ అంటాడు ధర్మరాజు. ‘ధర్మరాజు గారు నాకు అంతా తెలుసు.. ఆ మూడు బండిల్స్‌ని దొంగతనం చేసింది మీరే అని తెలుసు.. ఈ స్వేడ్‌ని పిలిపించింది కూడా మీరేనని తెలుసు.. ఇన్ని తెలిసిన నాకు మీరు దాచిన మూడు బండిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టం అంటారా?’ అంటాడు రిషి. ధర్మరాజు తలదించుకుంటాడు. ‘ముళ్లుని ముళ్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెత మీకు తెలుసుకదా? మీరు ఎలాగైతే ఆ మూడు బండిల్స్‌ని దొంగతనం చేశారో.. మేము కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ బండిల్స్‌ని దొంగతనం చేశాం..’ అంటాడు రిషి.
ధర్మరాజు షాక్..

‘అంటే మీరు నా గెస్ట్ హౌస్‌కి వచ్చి దొంగతనం చేశారా?’ అంటాడు ధర్మరాజు. ‘ధర్మరాజు గారు తప్పదు కదా? మైనెస్ ఇన్టూ మౌనెస్ ప్లెస్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటాను.. మీరు చేసిన పనికి పరిష్కారంగా మేము చెయ్యాల్సి వచ్చింది కానీ.. మేము మీలాంగా దొంగలం కాదు’ అంటాడు రిషి. ‘రిషీ సార్’ అంటాడు ధర్మరాజు కోపంగా. ‘సార్ మీతో ఎవరు కావాలనే ఈ పని చేయించి ఉంటారు.. చూడండి మేము తలుచుకుంటే మిమ్మల్ని పోలీసులకి అప్పగించొచ్చు. కానీ నేను అలా చేయను. గౌరవప్రదరమైన లెక్చరర్ హోదాలో ఉన్నారు కాబట్టి..’ అంటాడు రిషి.
దొంగలో మార్పు..
