చంద్రుని ఉపరితలంపై చక్కర్లు కొడుతూ.. అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్‌కి భారీ ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో అది నాలుగు మీటర్ల వెడల్పు గల బిలాన్ని గుర్తించింది. ఇది గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై, రోవర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన మార్గాన్ని మళ్లించుకోవాలని సూచించారు. దీంతో రోవర్ తన మార్గాన్ని మళ్లించుకుంది. ప్రస్తుతం ఇది సురక్షిత మార్గంలో పయనిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఈ బిలాన్ని ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 27వ తేదీన 3 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించింది. దీంతో మార్గం మార్చుకోవాల్సిందిగా వెంటనే రోవర్‌ని ఆదేశించాం. ఇప్పుడది సురక్షితంగా కొత్త మార్గంలో పయనిస్తోంది’’ అని ఇస్రో ట్విటర్ మాధ్యమంగా తెలిపింది.
BREAKING NEWS చంద్రుడి పై చంద్రయాన్-3 కి తప్పిన భారీ ప్రమాదం ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారు
