రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్‌లో వెళ్లడమో చేస్తారు. కొందరు పోలీసులకు
దొరికిపోయి రకరకాల కారణాలు చెబుతారు. అయితే ఓ యువతి రోడ్డుపై కారులో వెళుతూ పోలీసులకు దొరికిపోయి మహానటిలా నటించింది. రోడ్డుపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
