దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు.
ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు. సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులను చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు.
ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ… ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు.
దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే… కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి.
అశ్వని నక్షత్రం లో పుట్టినవారు – నవ వత్తులు(9) భరణి నక్షత్రం లో పుట్టినవారు -షణ్ముఖ వత్తులు(6) కృత్తిక నక్షత్రం లో పుట్టినవారు ఏక లేదా ద్వాదశ వత్తులు(1లేదా 20) రోహిణి నక్షత్రం లో పుట్టినవారు ద్వి వత్తులు(2) మృగశిర నక్షత్రం లో పుట్టినవారు త్రి వత్తులు(3) ఆరుద్ర నక్షత్రం లో పుట్టినవారుఅష్ఠమ వత్తులు(8) పునర్వసు నక్షత్రం లో పుట్టినవారు పంచమ వత్తులు(5) పుష్యమి నక్షత్రం లో పుట్టినవారు సప్తమ వత్తులు(7) ఆశ్లేష నక్షత్రం లో పుట్టినవారు చతుర్ వత్తులు(4) మఖ నక్షత్రం లో పుట్టినవారు నవ వత్తులు(9) పుబ్బ నక్షత్రం లో పుట్టినవారుషణ్ముఖ వత్తులు(6) ఉత్తర నక్షత్రం లో పుట్టినవారుఏక లేదా ద్వాదశ వత్తులు(1,లేదా 20) హస్త నక్షత్రం లో పుట్టినవారుద్వి వత్తులు(2) చిత్త నక్షత్రం లో పుట్టినవారు త్రి వత్తులు(3) స్వాతి నక్షత్రం లో పుట్టినవారు అష్ఠ వత్తులు(8) విశాఖ నక్షత్రం లో పుట్టినవారు పంచ వత్తులు(5) అనూరాధ నక్షత్రం లో పుట్టినవారు సప్త వత్తులు(7) జ్వేష్ఠనక్షత్రం లో పుట్టినవారు చతుర్ వత్తులు(4) మూల నక్షత్రం లో పుట్టినవారు నవ వత్తులు(9) పూర్వాషాఢ నక్షత్రం లో పుట్టినవారు షణ్ముఖ వత్తులు(6) ఉత్తరాషాఢ నక్షత్రం లో పుట్టినవారు ఏక లేదా ద్వాదశ వత్తులు(1లేదా 20) శ్రవణం నక్షత్రం లో పుట్టినవారు ద్వి వత్తులు(2) ధనిష్ఠ నక్షత్రం లో పుట్టినవారుత్రి వత్తులు(3) శతభిషంనక్షత్రం లో పుట్టినవారు అష్ఠ వత్తులు(8) పూర్వాభాద్ర నక్షత్రం లో పుట్టినవారు పంచ వత్తులు(5) ఉత్తరాభాద్ర నక్షత్రం లో పుట్టినవారు సప్త వత్తులు(7) రేవతి నక్షత్రం లో పుట్టినవారుచతుర్ వత్తులు(4) పైన చెప్పిన విధంగా జన్మనక్షత్ర రీత్యా చెప్పబడిన వత్తులు వేసి దీపారాధన చేస్తే సకల శుభాలు కలగడం తో పాటు సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయి.
Spread the love బాగా దాహం వేస్తే హోటల్ కి వెళ్ళి మంచి నీళ్ళు త్రాగిన యువతికి ఎదురైన పెద్ద వింత ఘటన వణికిపోతున్న హైదరాబాద్ జనాలు ===>>> గుడ్లు పెడుతున్న 14 ఏళ్ల […]
Spread the love మేషంశుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. […]
Spread the love అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. […]