అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఒక్క మెతుకు కూడా వృధా చేయొద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ కొందరు తాము తినలేకపోయినా ఎక్కువ పరిమాణంలో పెట్టుకుని ఆహారాన్ని పారేస్తుంటారు. ఇంట్లోనే కాదు, హోటల్లోనూ ఇలాగే చేస్తుంటారు. అటువంటి వ్యక్తుల్లో మార్పు తెచ్చేందుకు ఓ రెస్టారెంట్ విచిత్రమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 60కే కోరినంత భోజనం పెడతామని, అయితే దీనికి షరతులు వర్తిస్తాయని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని కర్నావత్ రెస్టారెంట్. ఎంత తిన్నా ఫరవాలేదు కానీ

ఒక్క మెతుకు వదిలేసినా జరిమానా తప్పదని హెచ్చరించింది. అయితే, ఆ జరిమానా కూడా ఎక్కువేం కాదు, కేవలం రూ.50తో సరిపెట్టింది.
ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు లేవని తెగేసి చెప్పింది. ఈ నిబంధనలు అందరికీ స్పష్టంగా కనిపించేలా రెస్టారెంట్ గోడలపై పోస్టర్లను అతికించింది. దీంతో రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రూ. 60లకే అవసరమైనంత ఆహారం దొరకుతుందనే ఆఫర్‌కు జనం ఎగబడతారని రెస్టారెంట్ యాజమాన్యం అంచనా వేసింది. అయితే, కొందరు తాము తినేదాని కంటే ఎక్కువ పెట్టించుకుని చివరకు వృధా చేస్తారని భయపడింది. ఈ సమస్యకు పరిష్కారంగా పుట్టుకొచ్చినదే ఈ జరిమానా ఆలోచన.
===>>>ఈ వీడియొ అత్త-కోడలు మధ్య జరిగిన వింత సంభాషణ ఒక్క నిమిషం చూస్తే నవ్వు ఆపుకోలేరు ఒక్కసారిగా కింది ఈ వీడియో లో చూడండి<<<<<============
ఆహారాన్ని పారబోసే అలవాటు మాన్పించే ఉద్దేశంతోనే జరిమానాలు విధించాలని నిర్ణయించామని రెస్టారెంట్ యజమాని అర్వింద్ సింగ్ కర్నావత్ తెలిపారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ధాన్యాన్ని పండిస్తారని, దీనిని సాధారణ జనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్నదాతల కష్టం వృథా కాకూడదని ఆయన పేర్కొన్నారు. ఇక రోజుకు రెండు పూటలా కడుపు నిండా తిండి దొరకనివారు దేశంలో ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి.. ఆహారం ఎంతో విలువైనదన్న స్పృహ కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
