నందమూరిక తారకరత్న మృతితో వారి కుటుంబంలోనే కాక.. టీడీపీ, ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి.. చివరకు అనంత లోకాలకు వెళ్లారు. తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ సెలబ్రిటీలు, నందమూరి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సినిమాలు, రాజకీయాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తారకరత్న మృతి నేపథ్యంలో ఆయన భార్యాబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తారాకరత్న-జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బలమైన అనుబంధం ఉందో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకానొక సమయంలో జూనియర్ తారకరత్నకు ఆర్థిక సాయం చేశారంట. ఆ వివరాలు..
