నాచురల్ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ హీరోయిన్ కంటే ముందు జయసుధ కి సహజనటి అనే పేరు ఉంది. అయితే సాయి పల్లవి (Sai Pallavi) ఇప్పడు ఉన్న జనరేషన్ హీరోయిన్లకు చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా, పొట్టిపొట్టి బట్టలు ధరించకుండా, గ్లామరస్ పాత్రల్లో చేయకుండా, మేకప్ వేసుకోకుండానే చాలా సహజంగా నటిస్తుంది.
అందుకే ఈమెను న్యాచురల్ బ్యూటీ అని పిలుస్తున్నారు. ఇక సాయి పల్లవి ఎలాంటి మేకప్ వేసుకోక పోయినప్పటికీ కూడా ఆమె ఫేస్ లో ఒక రకమైన గ్లో కనిపిస్తుంది. ఇక ఈ హీరోయిన్ ఫిదా (Fida), శ్యాం సింగరాయ్, ఎంసీఏ,గార్గి, విరాటపర్వం, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించింది.
న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి త్వరలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించింది. దక్షిణాది సినిమాలో స్టార్డం చూస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌ను ఊపేయనుంది. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదట. మనీశ్ తివారి తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో కనిపించనుందని టాక్.
ఈ హీరోయిన్ సీతగా నటించనుందని ఎప్పటినుంచో వార్తుల వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ ఈ సినిమా నుంచి సైడ్ అయ్యిందని తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో ఆలియాకు బదులు సాయి పల్లవి అయితే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో మరోసారి బీటౌన్‌లో ప్రేమమ్ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఈ నటి స్పందించాల్సి ఉంది
Spread the love విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చెన్నైలోని ఆళ్వార్‌పేట డీడీకే రోడ్‌లోని ఇంట్లో కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. పెద్ద కూతురు పేరు మీరా. చిన్న కూతురు పేరు […]
Spread the love కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త ఒకటి. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన […]
Spread the love ఉపాసన సోషల్ మీడియాలో తరుచుగా నెగిటివ్ కామెంట్స్‌కు గురౌతున్నారట. ఈ విషయంపై ఆమె మాట్లాడారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోష్ టాక్ […]