Guppedantha Manasu మార్చి 27: ధర్మరాజుకి దబిడిదిబిడి.. కథ క్లైమాక్స్.. బట్టబయలైన నిజాలు

Spread the love

Guppedantha Manasu 2023 March 27 Episode: గత ఎపిసోడ్‌లో ధర్మరాజు ఇంటికి వసు, రిషీలు దొంగతనానికి వెళ్తారు. ఇక అక్కటి నుంచి వసు తింగరి వేషాలు… రిషి టెన్షన్ ప్రతీదీ నవ్వుతెప్పిస్తుంది. ఈ క్రమంలోనే వసు.. ధర్మరాజుకి దొరికేస్తుంది. అదెలా అంటే.. ఫుల్‌గా తాగేసి ఉన్న ధర్మరాజు వాష్ రూమ్‌లో టాయిలెట్ పోసుకోవడానికి వెళ్తూ వెళ్తూ.. రిషి, వసులు దాక్కున్న బెడ్ రూమ్ తలుపు బయటి నుంచి వేసేస్తాడు. దాంతో వసు, రిషీలు టెన్షన్ పడుతూ ఉంటారు. వసు వాళ్లు కరెక్టెన్ నుంచి బయటికి వచ్చి.. మాట్లాడుకుంటూ ఉండగా ధర్మరాజు బయటే వాష్ రూమ్‌కి వెళ్లి ‘అమ్మయ్యా ఈ రోజు నాకు చాలా సంతోషంగా గడిచింది’ అనుకుంటూ వసు, రిషీలు ఉన్న బెడ్ రూమ్ వైపు నడుస్తాడు. ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా సాగింది. ఇప్పుడు ఆ హైలైట్స్ చూద్దాం.

కళ్లు నులుముకునే లోపు..

కళ్లు నులుముకునే లోపు..

‘మరోసారి డోర్ వస్తుందో లేదో చూసి వస్తాను సార్’ అంటూ డోర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది వసు. రిషి వద్దు వద్దూ అని అరుస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే ధర్మరాజు డోర్ తీసేస్తాడు. వసు షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. రిషి.. కర్టెన్ వెనక్కి ఒక్క ఉదుటున దూకి.. ‘అమ్మబాబాయ్’ అంటూ దాక్కుంటాడు. ఇక ధర్మరాజు.. ‘వసుధారా..’ అంటూ మత్తులోనే కళ్లు నులుముకుంటూ ఉంటాడు. అలా కళ్లు నులుముకునే లోపు.. వసుని చేయి పట్టుకుని లటుక్కున లాగేస్తాడు రిషి. ఆ క్రమంలో ఇద్దరూ మంచం పక్కకే పడతాడు. ఒకరి మీద ఒకరు పడతారు. ఇక ధర్మరాజు కళ్లు నులుముకుని పరిశీలనగా చూసేసరికి.. వసు ఎదురుగా ఉండదు.

చివరినిమిషం దాకా..

చివరినిమిషం దాకా..

వసు ఎదురుగా లేకపోయేసరికి.. బ్రమా.. నా బ్రమా.. ఇదంతా నా బ్రమా అనుకుంటూ మంచం మీద పడి నిద్రలోకి జారుకుంటాడు ధర్మరాజు. అప్పటి దాకా వసు, రిషీలు ఒకరి మీద ఒకరు ఉంటారు. కాస్త తొంగి ధర్మరాజు పడుకున్నాడని చూసి.. నెమ్మదిగా ఆ గదిలోంచి బయటపడతారు. హాల్లో సోఫా దగ్గరకు వెళ్లి.. ఆ బండిల్స్ తీసుకుంటాడు రిషి. ‘ఇవే.. ఇవి మనం తీసేసుకుని వెళ్లిన విషయం చివరినిమిషం దాకా ఆ ధర్మరాజుకి తెలియకూడదు. వీటి స్థానంలో ఏవైనా పెట్టాలి.. ఇప్పుడు ఎలా?’ అంటుంది వసు. ‘సార్ ఉండండి’ అంటూ చిటికె వేసి మరీ.. వసు బ్యాగ్ లోంచి మూడు బండిల్స్ తెస్తుంది.

రిషీ ప్లాన్..

రిషీ ప్లాన్..

‘ఇలాంటి అవసరం వస్తుందనే కొన్ని వేస్ట్ పేపర్స్ చుట్టి ఈ బండిల్స్ తెచ్చా’ అంటుంది వసు. ‘వసుధార నువ్వు సూపర్’ అంటాడు రిషి నవ్వుతూ. ‘హహ.. మరి ఏం అనుకున్నారు సార్.. వాటి ప్లేస్‌లో ఇవి పెట్టేద్దాం’ అంటూ అసలు బండిల్స్ బ్యాగ్‌లో పెట్టేసుకుంటుంది. ‘డోర్ తీసి ఉంటే తనకు డౌట్ వస్తుంది కదా?’ అంటాడు రిషి. ‘హా.. సార్.. తనే వచ్చి మన కోసం డోర్ తియ్యడు కదా’

అంటుంది వసు. ‘తీసేలా నేను చేస్తా.. నువ్వు వెళ్లి ఆ సోఫా వెనుక దాక్కో’ అంటాడు రిషి మెయిన్ డోర్ పక్కనే ఉన్న సోఫాని చూపిస్తూ… వసు వెళ్లి దాక్కుంటుంది. ఇక రిషి కావాలనే మెయిన్ డోర్ దగ్గరకు పరుగున వెళ్లి తలుపు గట్టిగా కొట్టి.. తనుకూడా ఆ సోఫా వెనుకే దాక్కుంటాడు.

మళ్లీ సాయం చేసిన ధర్మరాజు..

మళ్లీ సాయం చేసిన ధర్మరాజు..

ధర్మరాజు ‘ఎవడురా ఈ టైమ్‌లో ఎవరు లేరు వెళ్లిపో’ అంటూ అరుస్తాడు. ఇక ధర్మరాజు కోసంగా బయటికి వచ్చి తలుపు తీసేదాకా.. రిషి కొడుతూనే ఉంటాడు. ధర్మరాజు వచ్చి.. కోపంగా ఈ టైమ్‌లో ఎవడ్రా.. అయిపోయావ్ రా నా చేతుల్లో అంటూ తలుపు తీయగానే.. సోఫా వెనుకే దాక్కున్న రిషి, వసులు కూల్‌గా అక్కడ నుంచి జారుకుంటారు. ఇక మరునాడు ఉదయాన్నే జగతీ, మహేంద్ర, రిషి, వసు, మిగిలిన కాలేజ్ లెక్చరర్స్.. అంతా వెయిట్ చేస్తూ ఉంటే.. ధర్మరాజు ఇద్దరు స్వేడ్ ఆఫీసర్స్‌ని తీసుకుని వస్తాడు. ‘వీళ్లు స్వేడ్ మహేంద్ర గారు. మీ కాలేజ్‌లో ఏవో అవకతవకలు జరిగాయని ఎవరో కాల్ చేసి చెప్పారట.. చెక్ చేయడానికి వచ్చారు. ఈ కాలేజ్‌‌లో అలాంటివేం జరగవని నేను చెబుతూనే ఉన్నాను..’ అంటాడు ధర్మరాజు. దాంతో మహేంద్ర నవ్వుతూ.. ‘ఒక సారి చెక్ చేస్తే అయిపోతుంది కదా.. పదా వెళ్దాం’ అంటాడు.

ఇవేంటి ఇక్కడున్నాయ్..

ఇవేంటి ఇక్కడున్నాయ్..

దాంతో ఆ సీక్రేట్ రూమ్ దగ్గరకు వెళ్తారు అంతా. అక్కడ లాక్ సీల్ చేసి ఉండటం చూసి షాక్ అవుతాడు ధర్మరాజు. బండిల్స్ మిస్ అయిన విషయం తెలియొద్దు అని సీల్ చేసి పెట్టేశారేమో.. అయినా లోపల

===========>>>>>>>సీరియల్ ఇంకా ఉంది..ఇక్కడ క్లిక్ చేయండి<<<<<<===============