నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
