Krishna Mukunda Murari Today: సీరియల్ 116 ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక కృష్ణ తెగించింది. గౌతమ్‌కి కాల్ చేసి.. ‘గౌతమ్ సార్ మీరు నేను చెప్పినట్లు చేయండి’ అంటూ ఏదో సలహా ఇస్తుంది. ‘కృష్ణమ్మా ఇది మరీ రిస్క్ అవుతుంది కదా? ఇబ్బందులొస్తాయి’ అంటాడు గౌతమ్. ‘లేదు సార్.. అందంతా నేను చూసుకుంటాను.. మీరైతే రండి’అంటుంది కృష్ణ. సరే అంటూ ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్.ఇక మరునాడు ఉదయాన్నే కృష్ణ.. వంట చేస్తున్న రేవతి దగ్గరకు వెళ్లి..‘అత్తయ్యా.. ఇంటికి ఓ అతిథిని పిలిచాను.. మీ మీద నమ్మకంతో.. వంటలు బాగా చేస్తారుగా?’ అంటుంది. ‘సరే అమ్మా.. చాలా బాగా చేస్తాను.. ఇంతకీ వచ్చేది ఎవరు?’ అంటుంది రేవతి. ‘మన నందిని ప్రేమించిన సిద్దూ అత్తయ్యా’ అంటుంది కృష్ణ, వెంటనే రేవతి చేతిలోని గరిటె జారవిడుస్తుంది షాక్‌లో. ‘ఏం చేస్తున్నావ్ కృష్ణా.. అక్కకి కోపం తెప్పించే పనులు నువ్వెందుకు చేస్తున్నావ్’ అంటూ కంగారు కంగారుగా అరుస్తుంది రేవతి చుట్టూ చూస్తూ. ‘అత్తయ్యా అసలేం జరిగిందో మీకు తెలియదు’ అంటూ నందిని గతాన్ని భవానీ పంతాన్ని మొత్తం చెబుతుంది కృష్ణ. అది మ్యూజిక్‌తో సాగుతుంది. మాటలు వినిపించవు.ఇక మరోవైపు కృష్ణ రేవతీతో.. ‘అత్తయ్యా మీకు మరో విషయం తెలుసా.. ఆ సిద్దూ ఎవరో కాదు..
