అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం.దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా ‘అరుణ గ్రహం’ అని కూడా పేరు వచ్చింది. ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో నాలుగో స్థానంలో ఉంటుంది. ఈ గ్రహం సూర్యుడు నుంచి 14 కోట్ల పది లక్షల

మైళ్ళ దూరంలో ఉంది ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుంది ఆగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి 14 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.ఈ గ్రహంలో ఎర్ర రాళ్లు ఉండటం వలన ఎర్రగా ఉంటుంది సూర్యుని చుట్టూ తిరిగే దీనికి కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది అందువలన ఇది పరిభ్రమించే టప్పుడు కొన్ని సమయాల్లో దగ్గరగానే మరి కొన్ని సమయాల్లో దూరంగానే ఉంటుంది దీని పరిమాణం భూ పరిమాణాల్లో 1/9 వంతు.
అంగారకుడి పుట్టుక గుఱించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి.
1. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.
2. ఒకసారి, నేల మీద పడ్డ విష్ణువు చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే ‘కుజ గ్రహం’ అని పద్మ పురాణం చెబుతుంది.
