ప్రమాదం జరిగిన వెంటనే పవిత్ర విషయం లో జరిగిన పెద్ద దారుణం తెలిస్తే షాక్

Spread the love

బుల్లితెర ఆడియన్స్‌ ఫేవరెట్ సీరియల్స్‌లో ‘త్రినయని’ కూడా ఒకటి. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ సీరియల్‌‍తో పాపులర్ అయిన నటి పవిత్ర జయరామ్ మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఓ యాక్సిడెంట్‌లో ఆమె కన్నుమూసినట్లు సమాచారం. ఆమె ప్రయాణిస్తున్నకారు బస్సును ఢీకొట్టగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో పాటు కారులో తన తోటి నటులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై టీవీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త్రినయని సీరియల్ హీరోహీరోయిన్లు చందు గౌడ, ఆషికా పదుకొణె ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వీరితో పాటు తోటి నటీనటులు ఈ ప్రమాదం విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే పవిత్ర విషయం లో జరిగిన పెద్ద దారుణం తెలిస్తే షాక్