కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్ తెలుగులో ‘త్రినయని’ ధారావాహిక ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తున్నారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో ఆమె నటనకి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కర్ణాటకకి చెందిన ఈమె ‘రోబో ఫ్యామిలీ’ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జోకలి, నీలి, రాధారామన్ వంటి అనేక సీరియల్స్‌లో నటించారు.
ఇక పవిత్ర జయరామ్‌కి 16 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి అయింది. ఆమెకి 22 ఏళ్ల బాబు, 19 ఏళ్ల పాప ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా తన భర్తకి ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.