హిందూవేదశాస్త్రం ప్రకారం దేవుడు ఒక్కడే..కానీ రూపాలే అనేకం. భగవంతుని ప్రతిరూపం వెనక పవిత్రత ఉంటుంది. భగవంతుని పలు రూపాల్లో పూజిస్తారు. అగ్నిపురాణం ప్రకారం_మీ జీవితంతో శాంతి, విజయం, సంపద పొందాలంటే మీరు మీ రాశి ప్రకారం ఏ దేవుడిని పూజించాలి. తెలుసుకుందాం.
మేష రాశి-సూర్యుడు:
సూర్యడు మేష రాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు. కాబట్టి మేషరాశి వారు సూర్యుని పూజించాలి. సంపద, ఆరోగ్యం, వృద్ధి, విజయం శ్రేయస్సు కోసం ప్రతిరోజూ సూర్యునికి అర్హ్యం సమర్పించాలి. ఆదివారాలు ఉపవాసం ఉండి సూర్యుడిని, రాముడిని పూజించాలి. సూర్య మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి. కనీసం రోజుకు ఒక్కసారైనా రాగి పాత్రలోని నీటిని తాగాలి.
వృషభరాశి- చంద్రుడు
ఈవారు సోమవారం లేదా శుక్రవారం చంద్రుని పూజించి ఉపవాసం ఉండాలి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది భూ తత్త్వ రాశి. దీని రంగు తెలుపు. కాబట్టి చంద్రుడిని ప్రార్థించండి. పేదలకు తెల్లని బట్టలు దానం చేయండి. “ఓం సోమ సోమాయ నమః” అనే చంద్రబీజ మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.
3.మిథునరాశి- లక్ష్మీదేవి ఈ వారు ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం పొందడానికి లక్ష్మీ దేవిని పూజించాలి. బుధ, గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించి “శ్రీ” అని జపిస్తూ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించండి.
కర్కాటక రాశి–హనుమంతుడు
ఈరాశివారికి చంద్రుడు అధిపతి. కాబట్టి కర్కాటక రాశి వారు మంచి ఆరోగ్యం, ధైర్యం కోసం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించాలి. అదృష్టం, శ్రేయస్సు, కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుడిని, సరస్వతీ దేవిని పూజించాలి. కోతులకు బెల్లం తినిపించండి. హనుమాన్ ఆలయంలో మానసిక, శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచండి.
కన్యారాశి- కాళీ దేవి ఈ రాశివారు మంచి ఆరోగ్యం, సంపద కోసం హనుమంతుడిని కాళిమాతను పూజించాలి.
తులారాశి- పార్వతీదేవి తులారాశివారు పార్వతీదేవిని, లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారాల్లో శివ-పార్వతి దేవాలయానికి వెళ్లండి. శివ-పార్వతి విగ్రహానికి అభిషేకం చేయండి. శివుడు పార్వతితో పాటు గణేశుడిని ఆరాధించడం వల్ల మీకు గొప్ప విజయాలు ఆనందం లభిస్తుంది.
వృశ్చికరాశి – గణపతిదేవుడు వృశ్చిక రాశివారు మంగళ, బుధవారాల్లో గణేశుడిని, హనుమంతుడిని పూజించాలి. గణేశుడికి మోదకం, హనుమంతుడికి లడ్డూ నైవేద్యంగా పెట్టండి. వీరిని పూజించడం వల్ల మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి- విష్ణువు ధనుస్సు రాశి వారు విజయం, కీర్తి, సంపద, ఉన్నత స్థితి, భౌతిక శ్రేయస్సు, జీవితంలో ప్రభావవంతమైన స్థానం కోసం విష్ణువును ఆరాధించాలి. ప్రతిరోజూ “ఓం నమో నారాయణ” అని జపించండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఏకాదశి నాడు విష్ణుపూజ, హోమం నిర్వహించండి.
మకరరాశి -సరస్వతీ దేవి
మకరరాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి. మీ పుస్తకాలలో నెమలి ఈకలను ఎప్పుడూ ఉంచుకోండి. పుస్తకాలను నేలపై, మీ పాదాల దగ్గర లేదా కింద ఎప్పుడూ ఉంచవద్దు. సరస్వతీ దేవిని పూజించడం వల్ల గొప్ప విజయాలు కీర్తి లభిస్తాయి.
కుంభ రాశి- శని
కుంభరాశివారు శని, గణేశుని పూజించాలి. అదృష్టం, మంచి ఆరోగ్యం, సంపద , శ్రేయస్సు కోసం శనివారం నాడు వీధి కుక్కలు, పక్షులు, ఆవులకు ఆహారం ఇవ్వండి. ప్రతి ఉద్యోగంలో జీవితంలోని ప్రతి అంశంలో విజయం, ఆనందం కోసం పేదలు, నిరాశ్రయులకు ఆహారం, బట్టలు మరియు దుప్పట్లు దానం చేయండి. ప్రతి శనివారం శని దేవాలయంలో శని మంత్రాన్ని జపించండి.
Spread the love అంగారకుడు సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం.దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా ‘అరుణ గ్రహం’ అని కూడా పేరు వచ్చింది. ఇది సౌర కుటుంబం సూర్యుని […]
Spread the love వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. […]
Spread the love పనులు ” శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను […]