రాఖీ పౌర్ణమి ఈ ఏడాది ఏ తేదీ నాడు జరుపుకోవాలి అన్న సందేహం అందరిలోనూ మెదులుతోంది. ఈ ఏడాది రాఖీ పౌర్ణమికి సంబంధించి ఆగస్టు 30, 31వ తేదీలు రెండు ప్రచారంలో ఉండడమే ఇందుకు కారణం. ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు ఉంటుందనే అంశంపై క్లారిటీ కొరవడింది. కొందరు ఈ నెల 30న రాఖీ పౌర్ణమి అంటుంటే.. మరి కొందరు మాత్రం 31న రాఖీ అని చెబుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం రాఖీ పౌర్ణమికి సంబంధించి ఈ నెల 31న ఆప్షనల్ హాలీడేను గతంలో ప్రకటించాయి. దీంతో రాఖీ పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు
