అప్సర హత్య కేసు… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో ఆ యువతితో తిరిగిన పూజారి సాయికృష్ణ.. పెళ్లి చేసుకోవాలనే సరికి అప్సరను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికి కనిపించకుండా ఓ మ్యాన్ హోల్ లో పడేసి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు. కానీ,

అసలు నిజాలు బయటకు పొక్కడంతో నిందితుడు సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై నిందతుడు సాయి కృష్ణ భార్య శ్రావణి తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నా భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదంటూ నిందితుడు సాయి కృష్ణ భార్య తెలిపింది. ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది వాస్తవం. కానీ, వీరి మధ్య అలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పుకొచ్చింది. అప్సర చాలా సార్లు మా ఇంటికి పూజకు కూడా వచ్చింది. గుడిలో నా భర్తకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకరు అప్సరు అన్నారు. ఆమె గర్భవతి కావడం
