ప్రముఖ గాయని వాణి జయరాం ఫిబ్రవరి 4వ తేదీన చెన్నైలోని తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపై మీడియాలో అనేక అనుమానాలు వ్యాపించాయి. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు..

వివిధ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దిగ్గజ గాయని వాణి జయరాం (Vani Jayaram) ఈ నెల 4న చనిపోయారు. చెన్నైలోని తన ఇంట్లోనే చనిపోయిన వాణి జయరాం ముఖంపై గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో తమిళనాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసుకున్నారు. కాగా తాజగా పోస్టుమార్టం నివేదిక (Postmortem report) రావడంతో ఆమె మృతికి సంబంధించిన

మిస్టరీ (Death Mystery) వీడింది. దివంగత గాయని ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన మీదట ప్రమాదవశాత్తు చనిపోయినట్లు అంచనాకు వచ్చారు పోలీసులు. బెడ్ రూమ్‌లోని గ్లాస్ టేబుల్‌పై పడిపోవడంతోనే తలకు బలమైన గాయమైందని, ఇంట్లో ఎవరూ లేనందున ఆమెకు ట్రీట్మెంట్ అందక చనిపోయిందని నిర్ధారించారు.
వాణి జయరాం ఉంటున్న అపార్ట్‌మెంట్ సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఎటువంటి అనుమానాస్పద కదలికలు గుర్తించలేదని వెల్లడించారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. ఆమె మరణించే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. డోర్ లోపల నుంచి లాక్ చేయబడింది. కాగా.. శనివారం వాణి జయరాం భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
