గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీ, టీవీ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో గురువారం (ఆగస్టు 31) సాయంత్రం నటి అపర్ణ విగత జీవిగా కనిపించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నటి ఆగస్టు 31 రాత్రి 7 గంటల 30 నిముషాల సమయంలో చనిపోయినట్లు సమాచారం.
