ఈ రోజు ఆదివారం రాశి ఫలితాలు మీకోసం

Spread the love

మేష రాశి
శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్యాల విషయంలో ఆర్థికంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు. కుటుంబంలో చిన్నచిన్న కలహాలు ఉంటాయి. వారాంతంలో శుభవార్త వింటారు. విందు, వినోదాలకు హాజరవుతారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం

మీరు పట్టిందల్లా బంగారమే. అదృష్టయోగం బలంగా ఉంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. రాబడి పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. వారాంతంలో ఆరోగ్యపరమైన చికాకులు ఏర్పడవచ్చు. సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.

మిథునం

ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. వారం మధ్యనుంచి మంచి మార్పు ఉంది. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు పని పెరుగుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. సూర్యారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

సమయస్ఫూర్తితో విజయం వరిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు అందుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. పదోన్నతి, అనుకూల బదిలీకి అవకాశం. వృత్తి, వ్యాపారాల్లో సాహసంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు తల్తెవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి బాగుంటుంది. అందుకు తగ్గ ఖర్చులూ ముందుకువస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని ఒత్తిడితో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సంయమనంతో వ్యవహరించండి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య

సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాపారం సాఫీగా సాగుతుంది. క్యాటరింగ్‌, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాల్లో ఉన్నవాళ్లు మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. అధికారుల అనాదరణకు గురవుతారు. సహోద్యోగుల సహకారం అంతగా దక్కకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారాంతంలో పరిస్థితిలో అనుకూలమైన మార్పు వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

తుల

పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం

అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు అందరి మన్ననలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత కాలం వేచి ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన అవసరం. అనవసరమైన ఆలోచనలు తలెత్తుతాయి. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులకు మంచి సమయం. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

మకరం

ప్రయాణాలు కలిసివస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. శారీరక సమస్యలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నతవిద్య అనుకూలిస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్యవృత్తిలో ఉన్నవారికి కాలం కలిసివస్తుంది. వారాంతంలో కొన్ని చికాకులు తలెత్తుతాయి. బంధువులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. శివారాధన శుభప్రదం.

కుంభం

గతంలో ఉన్న సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. విహార యాత్రలు చేపడతారు. గురుభక్తి పెరుగుతుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మీనం

మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఇంట్లో పెద్దవాళ్లతో చర్చించడం అవసరం. దూర ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణ రంగంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.