నందమూరి తారకరత్న 39 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూయడం అందర్నీ శోకసంద్రంలో ముంచెత్తుతోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వస్తున్నట్లు తారకరత్న ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మరణించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తారకరత్న ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. తెలుగు దేశం పార్టీలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులను కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
