ఇది మహిళలు నడిపే కేఫ్. టీ, కాఫీలతో పాటు జ్యూస్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. యజమానితో పాటు వర్కర్లు అందరూ మహిళలే. పురుషులకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వరు.
”ఆడవాళ్లకు మాత్రమే పనికలిపించాలనే ఉద్దేశం మాది. జెంట్స్ కి యిక్కడ అంతా లేదు యిక్కడ. ఆడ వాళ్ళకు మాత్రమే పని కలపించే వుద్దేశ్యం తో డ్వాక్రా లాంటి సంఘాలు వున్నాయి కదా. అలాగా నేను యిక్కడ లేడీస్ కే ఉపాధి కల్పించాలని ఉద్దేశం తో చేస్తున్న. యింట్లో చిన్న గిన్నె పెడతాము యిక్కడ పెద్ద గిన్నె పెడతాము అంతే తేడా. యింట్లో నలుగురికి పెడితే యిక్కడ 40 మందికి పెడతాము” అని షాపు యజమానురాలు మాధవి చెప్పారు.

ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తిరుపతికి చెందిన మాధవి టీ వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు మూడు షాపులు నిర్వహిస్తున్నారు. అన్నిట్లోనూ ఆడవాళ్లకే ఉద్యోగాలు ఇచ్చారు. ఈ షాపుల్లో 20 మంది వరకు మహిళలు పని చేస్తున్నారు.
”టీ తాగేదానికని వచ్చాను పని ఉందా అని అడిగాను ఇస్తామని చెప్పారు. ఇక్కడే కంటిన్యూ చేసుకుంటున్నా.. ఈడ పనిచేసుకుంటేనే లేకపోతే ఎంలేదు” అని షాపులో పనిచేసే మహిళ కళ చెప్పారు.
టీ మాస్టర్ నుంచి క్లీనింగ్, సప్లై అంతా ఆడవాళ్లే చూసుకుంటారు. అందరూ అన్ని పనులూ చేస్తారు. ఇక్కడ వచ్చిన జీతంతో తమ పిల్లల చదువులు సాఫీగా సాగుతున్నాయని కళావతి చెబుతున్నారు.”మా ఆయన టైలరింగ్ చేస్తాడు. మా ఆయన సంపాదన సరిపోవడం లేదు. నా సంపాదన తోడైతే
===>>>ఈ వీడియొ అత్త-కోడలు మధ్య జరిగిన వింత సంభాషణ ఒక్క నిమిషం చూస్తే నవ్వు ఆపుకోలేరు ఒక్కసారిగా కింది ఈ వీడియో లో చూడండి<<<<<============
పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను. నాకు ఇబ్బంది లేకుండా మా పిల్లల చదువులకి జరుగుతోంది” అని టీ షాపులో పనిచేసే మరో మహిళ కళావతి అన్నారు.
