నిమ్స్ ఐసీయూలో ఉద్రిక్తత నెలకొంది. నిమ్స్ డాక్టర్లు నోరు జారటంతో.. ప్రీతి బంధువులు వాగ్వాదానికి దిగారు. ప్రీతిని చూడటానికి లోపలికి రావాలని తల్లిదండ్రులకు డాక్టర్ల పిలిచారు. ప్రీతి ఎలా చనిపోయిందో చెప్తేనే ఐసీయూ లోపలికి వస్తామని కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించారు. ప్రీతి ఏ ఇంజెక్లన్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి గల కారణాలు సమగ్రంగా వివరించాలని కోరారు. దీనికి వైద్యులు సర్ధిచెప్పే ప్రయత్నం
చేయకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. లోపలికి రాకుంటే డెడ్ బాడీని అలాగే ప్యాక్ చేసి పంపించాలా.. అంటూ వైద్యులు నోరు జారటంతో… ప్రీతి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. డాక్టర్ల వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చూడకుండా బాడీని ఎలా ప్యాక్ చేయమంటారని ఆందోళన చేశారు. దీంతో.. నిమ్స్ ఐసీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. ప్రీతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రీతి మరణ వార్త వినగానే నిమ్స్ ఆస్పత్రి మంత్రులు చేరుకున్నారు. శోఖ సంద్రంలో మునిగిపోయిన ప్రీతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సహనం కోల్వోయిన కుటుంబ సభ్యులకు మంత్రులు నచ్చజెప్పారు. ప్రీతి కుటుంబ సభ్యుల డిమాండ్లకు కూడా మంత్రులు అంగీకారం తెలిపారు. హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని, అతనిపై కేసు పెట్టాలని ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలా కాకుండా కేవలం విచారణ చేస్తామంటే అన్యాయం జరిగినట్టేనని ప్రీతి తండ్రి దండం పెట్టి మరీ కోరారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా.. ఆ డిమాండ్లన్నింటికీ మంత్రులు అంగీకరించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నరు. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమన్నారు. ఎవరూ పూడ్చలేని దుఖంలో ఆ కుటుంబం ఉందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
- తన కూతురు ప్రీతి విషయంలో ..మరో సంచలన విషయాన్ని బయటపెట్టి పెద్ద షాక్ ఇచ్చిన ప్రీతి తండ్రి ఏం అన్నాడో తెలుసా
- ప్రీతి కేసులో రాత్రికి రాత్రే ఊహించని పెద్ద మలుపు ఆడియో మొత్తం లీక్ అమ్మాయి మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు
- ప్రీతి కేసులో బయటపడ్డ మరో పెద్ద ట్విస్ట్ ఆమె ఫోన్ లో ఏం దొరికిందో చూసి ఒక్కసారిగా ప్రీతి తల్లిదండ్రులు షాక్
- అలేఖ్యరెడ్డి కి కీలకమైన పదవి రాత్రికి రాత్రే చంద్రబాబు ఫోన్ ఏమిటో తెలిసి షాక్ లో అలేఖ్య రెడ్డి
- భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత భార్య అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్ చూసి ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్,బాలయ్య సైతం షాక్