బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గించుకోవచ్చని చాలా మంది ఇప్పటికే రుజువు చేశారు. మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినపుడు భారీ లగేజీ (Luggage)ని తీసుకెళ్తుంటాం. వాటిని మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటాం. బైక్ మీద వెళ్తే లగేజీ పెట్టడానికి స్థలం ఉండదని, కార్లు, ఆటోలు బుక్ చేస్తుంటాం. అయితే ఓ యువకుడు లగేజీ ట్రాలీ బ్యాగ్‌లను (Trolley bags) బైక్‌పై తీసుకెళ్లడానికి చాలా సులభమైన మార్గం కనిపెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
