జ్యోతిష్యం పరంగా రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ నెల 30వ తేదీన శని జయంతి (Shani Jayanti 2022) వస్తోంది. 30 ఏళ్ల తర్వాత ఈసారి శని జయంతి రోజున శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. జూన్ 5 నుంచి అక్టోబరు 23 వరకు శని తిరోగమనంలో (Saturn Retrograde 2022) ఉంటుంది. ఇది 141 రోజుల పాటు అన్ని రాశిచక్ర గుర్తులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి శని తిరోగమనం వల్ల కష్టాలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో చూద్దాం.
మేషం (Aries)-
శని తిరోగమనం మేష రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమయం ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. పెట్టుబడికి దూరంగా ఉండటం మంచిది, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఇది వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో గొడవలు రావచ్చు. టెన్షన్, అపార్థాలు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer)-
శని తిరోగమనంలో కర్కాటక రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోంటారు. వీరు ప్రమాదాల బారిన పడవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది కాదు. వీలైతే, అలాంటి నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయండి. ఖర్చులను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం.
మకరం (Capicron)-
మకరరాశి వారు శని తిరోగమనం ఎదుర్కొంటారు. ఇది వీరి కెరీర్‌పై చెడు ప్రభావం చూపుతుంది. కెరీర్‌లో ఆటంకాలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కటువుగా మాట్లాడటం, కోపగించుకోవడం హాని కలిగిస్తాయి.
ధన నష్టం కూడా రావచ్చు. మొత్తంమీద, ఈ సమయంలో ఓర్పు మరియు సంయమనంతో ముందుకెళ్లండి.
కుంభం (Aquarius)-
తిరోగమన శని కుంభ రాశి వారికి అశుభ ఫలితాలను ఇవ్వగలదు. ఈ సమయం ఈ వ్యక్తులకు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందిని కలిగిస్తుంది. వివాహం లేదా సంబంధం కాలక్రమేణా విచ్ఛిన్నం కావచ్చు. వైవాహిక జీవితంలో అపార్థాలు ఏర్పడవచ్చు. పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఎవరినీ పెళ్లి చేసుకోకండి. మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి.
Spread the love మేషంగౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, […]
Spread the love ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు […]