వాణీ జయరాం ముఖం, నుదుటిపై గాయాలున్నట్లు చెప్పిన పనిమనిషి
గాయని ఇంటిని అధీనంలోకి తీసుకున్న పోలీసులు
ఇంటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈమేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. దీంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయని, అప్పటికి ఆమె స్పృహలో లేరని వివరించారు.
దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు తనిఖీ చేశారు. తర్వాత వాణీ జయరాం పార్థివ దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Spread the love ప్రముఖ గాయని వాణి జయరాం ఫిబ్రవరి 4వ తేదీన చెన్నైలోని తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపై మీడియాలో అనేక అనుమానాలు వ్యాపించాయి. దీంతో కేసు […]
Spread the love జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలను చేస్తాయి. గురు బృహస్పతి మీనంలో కూర్చున్నాడని మరియు జనవరి 25 రాత్రి చంద్రుడు మీనరాశిలోకి […]
Spread the love మేషంప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు […]