ఫ్యాషన్ ప్రపంచంలో వస్త్రాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఫ్యాంట్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడా ఇవి వేసుకోకూడదు అనే ఆంక్షలు లేవు. ట్రెండింగ్ లో ఉన్న వస్త్రాధారణలో రిప్పెడ్ జీన్స్(Ripped jeans) కూడా ఒకటి. మోకాళ్ళు, తొడల ప్రాంతంలో చిరిగిపోయినట్టు ఉండే ఈ జీన్స్ పట్ల నేటి జనరేషన్ యూత్ కు చాలా క్రష్ ఉంది. ఓ టీనేజ్ అమ్మాయి స్కూల్ కు రిప్పెడ్ జీన్స్ వేసుకుని వెళ్ళగా స్కూల్ టీచర్ చేసిన పని పెద్ద రచ్చకు కారణం అయింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఒక టీనేజ్ అమ్మాయి రిప్పెడ్ జీన్స్ వేసుకుని స్కూల్ కు వెళ్ళింది. ఆ అమ్మాయి తొడల భాగంలో ఓపెన్ గా కనిపిస్తోందని స్కూల్ టీచర్ అమ్మాయి తొడల భాగంలో టేప్ అంటించింది. ఆరోజు స్కూల్ అయిపోయాక ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే, తొడల భాగంలో టేప్ ఉండటం చూసి ఆ అమ్మాయి తల్లి ఏం జరిగింది అడిగి తెలుసుకుంది. టీచర్ చేసిన పనికి ఉగ్రురాలు అయిపోయింది. ఆ విషయాన్ని లైట్ తీసుకోకుండా కూతురి ఫోటో తీసి ‘స్కూల్లో ఇలాంటి ఫ్యాంట్ లు వేసుకుని రాకూడదనే రూల్ ఏమైనా ఉందా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కింది.
అంతటితో ఆగకుండా ‘నా కూతురు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ టీచర్ ఇలా టేప్ అంటించడం వల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇలా చెయ్యడం ఎంత వరకు సమంజం?’ అని తన ఆవేదన వెళ్ళగక్కింది. ‘స్కూల్ కు వెళ్ళిన అమ్మాయికి టేప్ లు అంటించి పంపించడం ఎంత అవమానంగా ఉంటుంది. తరగతిలో పిల్లలు తనని చూసి నవ్వుతారని, పిల్లలు చాలా సున్నితమైన వాళ్ళనే విషయం టీచర్ కు తెలియదా?’ అని నిలదీసింది. ఈ విషయాలన్నీ

టిక్ టాక్ వేదికగా ఆమె సోషల్ మీడియాతో పంచుకుంది. చాలా మంది ఈ మహిళకు సపోర్ట్ ఇస్తూ కామెంట్ చేశారు. అమెరికా లాంటి ప్రాంతాల్లోనూ ఇలాంటి వివక్షలేంటి అంటున్నారు.